మున్సిపాలిటీ అధికారులకు సీపీఎం నాయకుల వినతి

మున్సిపాలిటీ అధికారులకు సీపీఎం నాయకుల వినతి

ATP: గుంతకల్లు పట్టణంలోని హిందూ స్మశానవాటికలో కంపచెట్లను తొలగించాలని కోరుతూ సోమవారం సీపీఎం పార్టీ నాయకులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీదేవికు వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకులు మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. స్మశాన వాటికలో కంప చెట్లతో అంత్యక్రియలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కంపచెట్లను తొలగించాలని వారు కోరారు.