అక్రిడిటేషన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి: కమిషనర్
TG: జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పెషల్ కమిషనర్ ప్రియాంక తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10న జరిగే రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్క్రూట్నీ చేసి అర్హులైన జర్నలిస్టులకు నూతన కార్డులు జారీ చేస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్‌లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించారు.