VIDEO: తెలంగాణ భవన్‌లో ఘనంగా విజయ్ దివస్
HYD: తెలంగాణ భవన్‌లో విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.