కూలీన వంతెన.. గ్రామస్థుల ఆవేదన

కూలీన వంతెన.. గ్రామస్థుల ఆవేదన

SKLM: పోలాకి మండలం పరపతి వాని పేట వద్ద ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కర్రలవంతెన కూలిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ వంతెన విరిగిపోయిందని గురువారం తెలిపారు. తాము పంట పొలాలకు గెడ్డ నుండి దాటుకుని వెళ్లేందుకు ప్రమాదకరంగా ఉండడంతో ఈ కర్ర వంతెనను నిర్మించుకున్నామని అన్నారు. ఇది నేడు కూల్ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.