CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NDL: నందికొట్కూరు మండలంలోని బిజినవేముల, నాగుటూరు, కొణిదెల గ్రామాలకు చెందిన 5 మంది లబ్ధిదారులకు CMRF కింద రూ.2,27,041 విలువైన చెక్కులను ఇవాళ ఎమ్మెల్యే గిత్త జయసూర్య పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసి పరామర్శించారు. అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.