నేడే వాలీబాల్ లీగ్ ప్రారంభం..!
కృష్ణా: ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాడుయు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సాయంత్రం తాడేపల్లిలో 'మంగళగిరి వాలీబాల్ లీగ్-4' నిర్వహించనున్నారు. మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బోగి వినోద్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతుండగా, మొత్తం 64 జట్లు పాల్గొంటున్నాయి. విజేతలకు మొదటి బహుమతి రూ. 1.50 లక్షలు, రెండవ రూ. లక్ష, మూడవ బహుమతి రూ. 50 వేలుగా అందజేయనున్నారు.