ఉచిత కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

MNCL: బెల్లంపల్లి ZPHS (ఇంక్లైన్) లో ఉచిత కరాటే శిక్షణ తరగతులను జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మాస్టర్ విజయగిరి రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 6 వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబడుతాయని, పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ అందజేస్తామన్నారు.