యూరియా సరఫరాలో అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

PDPL: రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి, సరఫరాలో అక్రమాలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 50% యూరియా తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్మాగారంలో తరచుగా అమోనియా లీకేజీలు, సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, దీనివల్ల యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు.