ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ వెలిశాలలో నిరసన

ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ వెలిశాలలో నిరసన

SRPT: పహల్గామ్ ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామస్తులంతా కలిసి కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ నిరసనలో యువత, మహిళలు, గ్రామపెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.