విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

SKLM: శ్రీకాకుళం M గూడెం గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్‌తో ఆర్. కృష్ణారావు(53) అనే వ్యక్తి మృతి చెందాడు. గృహ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో 11 కె.వి. విద్యుత్ తీగలను తాకడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాము తెలిపారు.