23న జిల్లాకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్
ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె విష్ణుప్రియా రెడ్డి వివాహం ఈ నెల 23న జరగనుంది. ఈ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ తోపుదుర్తి కుటుంబ సభ్యులు ఇటీవల తాడేపల్లిలో జగన్‌ను కలిసి ఆహ్వానపత్రిక అందించారు.