గ్రామంలో మితిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు

మెదక్: చిన్న శంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. గ్రామంలోని చెరువు దగ్గర ఉన్న మెట్ల వద్ద ప్రతీ రోజు మద్యం సేవించి కాళీ మధ్యం సీసాలని పగలగొడుతున్నారు. ఇలా చేయడం వల్ల చెరువులో బట్టలు ఉతికే మహిళలకు, చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చే పశువులకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు.