మున్సిపల్ కార్యాలయంలో పుడ్ ఫెస్టివల్

MNCL: మంచిర్యాల నగర పాలక సంస్థలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి యూనిట్ ద్వారా ఉపాధి పొందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులతో పాటు పుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల స్టాల్స్‌ను మహిళలు సందర్శించి కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.