ఆకివీడులో భగ్గుమంటున్న నిమ్మ ధరలు

ఆకివీడులో భగ్గుమంటున్న నిమ్మ ధరలు

ప.గో: పెరుగుతున్న ఎండలతో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆకివీడు మార్కెట్లో కేజీ నిమ్మకాయలు రూ.180 నుంచి రూ.210 వరకు పలుకుతుండగా, ఒక్కో కాయ రూ.5కు చేరింది. ఏలూరు, పాలకొల్లు హోల్సేల్ మార్కెట్ల నుంచి దిగుమతి తగ్గుతుండటమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో హోల్సేల్ ధరలు కేజీ రూ.200 దాటే అవకాశం ఉండటంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.