భీమిలిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
VSP: భీమిలి TDP కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో MLA గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేసిన సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో టీడీపీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చిన తిరుగులేని నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.