శ్రీరామ మందిరంలో 167వ నగర సంకీర్తన

శ్రీరామ మందిరంలో 167వ నగర సంకీర్తన

SRD: జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ మందిరంలో 167వ నగర సంకీర్తన ఉల్లాసభరితంగా జరిగింది. శ్రీకృష్ణ కీర్తనలతో పట్టణంలోని ఆర్యనగర్ ప్రాంతంలో శోభయాత్ర నిర్వహించారు. భగవంతుడికి, భక్తునికి హరేకృష్ణ మహా మంత్రమే అనుసంధానంగా ఉండి సంధాన కర్తగా వ్యవహరిస్తుందని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి శ్రీ విభిషణ్ ప్రభు అన్నారు.