'ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం' కార్యక్రమం ప్రారంభం

'ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం' కార్యక్రమం ప్రారంభం

HYD: సిటీ పోలీసులకు 'ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం' అనే పేరుతో విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని DGP శివధర్ రెడ్డితో కలిసి సీపీ సజ్జనార్ ప్రారంభించారు. పోలీసు సిబ్బందిలో నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించడమే ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశమన్నారు. కమిషనరేట్ పరిధిలో దశలవారీగా రేపటి నుంచి శిక్షణ ఇస్తామన్నారు.