ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
ASF: వాంకిడి మండలం జైత్పూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లు, పూర్తయిన వాటి వివరాలను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ దశ వరకు పూర్తయిన ఇళ్ల లబ్ధిదారులను బిల్లుల గురించి అడిగి, మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.