VIDEO: తిరుమల వెంకన్న సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

TPT: AP హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం నైవేధ్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.