మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
PDPL: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. అటు ఎండ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.