బెంగాల్‌లో 284 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
బెంగాల్ అసెంబ్లీ బరిలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు 284 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్ ఆధిర్ రంజన్ చౌదరి బహరంపూర్ నుంచి, అలాగే టీఎంసీ నుంచి హస్తం పార్టీ గూటికి చేరిన మాజీ ఎంపీ మౌసమ్ నూర్ మాలతిపూర్ నుంచి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలైన ఖర్గే, రాహుల్ ఆమోదం తర్వాత ఈ జాబితా రిలీజైంది.