హోరాహోరీగా నామినేషన్లు.. ప్రతి ఓటు కీలకమే
TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రతరం కావడంతో ప్రతి ఓటు అభ్యర్థుల తలరాతను మార్చే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 4,236 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. సర్పంచ్ పదవులకు 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. 37,440 వార్డు సభ్యుల పదవులకు 82,276 మంది బరిలో ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు ఇద్దరు (2.19) పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 వరకు గడువు ఉంది.