ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.