రైలు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త మృతి
ప్రకాశం: సింగరాయకొండలోని సోమరాజుపల్లి రైల్వే గేటు మూడో లైన్ వద్ద రైలు ఢీకొని ఓ అంగన్వాడీ కార్యకర్త మృతి చెందారు. పోలీసులు వివరాల ప్రకారం.. సింగరాయకొండకు చెందిన రమాదేవి స్థానిక ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొనడంతో రమాదేవి అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.