రికార్డు ధర పలుకుతున్న తేజా మిర్చి
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో తేజ మిర్చి ధర క్రమంగా పెరుగుతుంది. గత నెలలో రూ.19వేలు ధర మాత్రమే పలికిన తేజ మిర్చి క్రమంగా పెరుగుతూ వస్తూ గతవారం రూ.21 వేల రికార్డు ధరకు చేరింది. సోమవారం క్వింటా మిర్చి ధర రూ.21,100 పలకగా, మంగళవారం మరింత పెరిగి రూ.21,600 అయింది. కాగా మార్కెట్‌కు తేజ మిర్చి పోటెత్తుతున్నది.