బైకు అదుపుతప్పి మహారాష్ట్ర వాసికి తీవ్రగాయాలు

బైకు అదుపుతప్పి మహారాష్ట్ర వాసికి తీవ్రగాయాలు

ASF: సిర్పూర్ (టి) మండలంలోని రైల్వే గేటు సమీపంలో మంగళవారం జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా బైకు అదుపుతప్పి కింద పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది హుటాహుటిన చేరుకుని, క్షతగాత్రుడిని సిర్పూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు.