రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మంచిర్యాల జిల్లా వేంపల్లి-ముల్కల మధ్య బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముల్కల గ్రామానికి చెందిన వెంకటేశ్ (30) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.