VIDEO: మాజీ ఎమ్మెల్యే బాలకిష్టయ్య జయంతి వేడుకలు
వనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన విగ్రహానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడన్నారు.