జనసేన ఆధ్వర్యంలో కార్మికులకు సన్మానం

మేడ్చల్: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గంలోని KPHB కాలనీ ఫేస్-5లో జనసేన పార్టీ ఆఫీస్ వద్ద మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ GHMC కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బహుమతులు, పండ్లు ఇచ్చి అల్పాహారం అందించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పోగ్రాం కమిటీ జనరల్ సెక్రటరీ మండలి దయాకర్, నియోజకవర్గ నాయకులున్నారు.