విజయ్‌పై టీవీకే మాజీ మహిళా నేత విమర్శలు
టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై ఆ పార్టీ మాజీ నేత రంజనా నచియార్ విమర్శలు గుప్పించారు. తన పార్టీలో మార్పులు తీసుకురాబోతున్నట్లు విజయ్ చెప్పారని.. కానీ తమ మాటల మీద అధినేత నిలబడం లేదని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న చాలా అంశాలను అనుమానించాల్సి వస్తోందని చెప్పారు. విజయ్ క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్, మహిళా నేతలను, ప్రజలను కలవడం లేదని తెలిపారు.