రేపు జిల్లా బాస్కెట్ బాల్ జట్టు ఎంపికలు

రేపు జిల్లా బాస్కెట్ బాల్ జట్టు ఎంపికలు

శ్రీకాకుళం: పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా బాస్కెట్ బాల్ జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.