‘హైదరాబాద్ బడ్జెట్‌లో ఓల్డ్ సిటీ వాటా ఏది?’
TG: 'మాకు రాజకీయాలు అక్కర్లేదు.. ఇప్పుడు ఓట్లు లేవు' అంటూ MLC కవిత హాట్ కామెంట్స్ చేశారు. HYDలోని యాకుత్‌పురాలో పర్యటించిన ఆమె.. పాతబస్తీ కష్టాలపై గళమెత్తారు. అక్కడ రోడ్లు, డ్రైనేజీలు 35 ఏళ్ల నాటివేనని, అభివృద్ధి ఎక్కడని ప్రశ్నించారు. సిటీ బడ్జెట్ రూ.5 వేల కోట్లలో ఓల్డ్ సిటీ వాటా ఎంతో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిలదీస్తేనే పనులు అవుతాయని స్పష్టం చేశారు.