ఈ నెల 25న హైదరాబాద్‌లో ఫ్రాన్స్ విదేశీ విద్యాసదస్సు

HYD: ఫ్రాన్స్‌లో చదవాలనే ఆసక్తి ఉన్నవారికి అక్కడి విద్యపై అవగాహన కల్పించేందుకు ఈనెల 25న హైదరాబాద్ మాదాపూర్లోని నోవాటెల్ కన్వెన్షన్ కేంద్రంలో సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే ఈ ఫెయిర్లో 50కి పైగా ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు పాల్గొననున్నాయి.