కార్తీక పౌర్ణమి.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.!

కార్తీక పౌర్ణమి.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.!

MDCL: కార్తీక పౌర్ణమి పండగ వేళ ఉప్పల్ పరిధిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయస్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉన్నారు. దేవాలయం ఎదుట దీపాలు వెలిగిస్తూ స్వామివారిని కోర్కెలు తీర్చాలని వేడుకుంటున్నారు. పండగ వేళ దేవాలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, కార్యనిర్వహకులు తెలిపారు.