తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన దగ్గర నుంచి రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలు పట్టించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.