కడపకు చేరుకున్న మాజీ ఉపరాష్ట్రపతి
KDP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గాన R&B అతిధి గెస్ట్ హౌసుకు చేరుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్, జెసి అతిథి సింగ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు తదితర అధికారులు బిజెపి నాయకులు స్వాగతం పలికారు. అయితే పలు కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.