జిల్లాలో తగ్గుముఖం పట్టనున్న వర్షాలు
ATP: జిల్లాలో రానున్న 5 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకరా బాబు, నారాయణస్వామి తెలిపారు. ఈ వాతావరణం పంట నూర్పిడి పనులకు రైతులకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రత 31.3 నుంచి 32.8 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 22.9 నుంచి 23.4 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.