VIDEO: గాడమైన రసానాలతో కలుషితమవుతున్న చెరువు
MDCL: ఎదులాబాద్‌లోని చెరువు గాడమైన రసాయనాలతో తీవ్రంగా కలుషితమవుతోంది. సమీప పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు నేరుగా చెరువులో కలుస్తుండటంతో నీటి రంగు మారి దుర్వాసన వ్యాపిస్తోంది. ఈ నీటిని పశువులు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.