VIDEO: డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థుల ఆందోళన
NGKL: పాలమూరు వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్, ప్రాక్టికల్స్ పూర్తికాకముందే ఏప్రిల్ 16 నుంచి పరీక్షలు నిర్వహించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్షలను మే నెలలో నిర్వహించాలని వర్సిటీ అధికారులను కోరారు.