ఒంటరిగా ఉన్న బాలికను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే శంకర్
SKLM: గార మండలం కొర్ని గ్రామంలో ఇటీవల అనారోగ్యం కారణంగా భార్యభర్తలు గుజ్జల గన్నిరాజు, పార్వతి ఇటీవల మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో బాలిక ఒంటరిగా మిగిలింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఆదివారం ఆ గ్రామంలో పర్యటించి బాలికను దత్తత తీసుకున్నారు. అమ్మాయి చదువు పూర్తయి వివాహం జరిగే వరకు అన్ని చూసుకుంటు అండగా ఉంటానన్నారు.