VIDEO: ఇందిరమ్మ క్యాంటీన్‌లో భోజనం చేసిన విహెచ్
HYDలోని ఇందిరమ్మ క్యాంటీన్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు భోజనం చేశారు. అనంతరం ఇందిరమ్మ క్యాంటీన్‌లో భోజనం చేసిన పలువురితో మాట్లాడి భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు రూ. 5కే అల్పాహారం, భోజనం అందించడమే ఇందిరమ్మ క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశం అన్నారు. పేదలు ఈ క్యాంటీన్లను ఉపయోగించుకోవాలన్నారు.