రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
AP: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనెపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటో అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.