VIDEO: తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో అవస్థలు

KMM: తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ఇవాళ తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌లో నిలబడి అవస్థలు పడ్డారు. యూరియా కొరతతో పంటలు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో యూరియా అందకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గిందని వాపోయారు. యూరియా కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని పేర్కొన్నారు.