మండల పరిషత్ హై స్కూల్లో అబుల్ కలాం జయంతి
కృష్ణా: మల్లాయిపాలెం మండల పరిషత్ హై స్కూల్‌లో భారత తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఎంపీడీవో విష్ణు ప్రసాద్ అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రషీద్ బేగ్, ఇబ్రహీం, నూర్ అహ్మద్ పాల్గొన్నారు.