రైతుల కన్నీటి ‘వర్షం’

రైతుల కన్నీటి ‘వర్షం’

NRML: దిలావర్పూర్ మండలం కాల్వలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలకొరిగింది. వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. వర్షాల వలన పంటల సాగు కోసం పెట్టిన ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు.