నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్
AP: మహిళల ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా మహిళా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, భారత మహిళా జట్టులోని రాష్ట్రానికి చెందిన క్రికెటర్ శ్రీచరణిని ఇవాళ సీఎం చంద్రబాబు కలవనున్నారు. అనంతరం SIPB, CRDA అథారిటీ భేటీలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఎన్జీరంగా యూనివర్సిటీలో కార్యక్రమానికి హాజరవుతారు.