గ్యాస్ కొరత.. ఏజెన్సీ వద్ద భారీ క్యూలైన్

గ్యాస్ కొరత.. ఏజెన్సీ వద్ద భారీ క్యూలైన్

KKD: జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. వినియోగదారులు ఉదయం నుంచే ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడ్డారు. సిబ్బంది స్టాక్ లేదని చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు దాదాపు గంటల తరబడి ఎదురుచూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. గ్యాస్ కొరతపై గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.