నేడు జిల్లాలో పర్యటించనున్న సీఎం, మంత్రి లోకేష్
ఇవాళ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. జిల్లాలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు వారు హాజరుకానున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.