ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ దాడి.. నగలు అపహరణ
TPT: గూడూరు నుంచి ఆటోలో వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాలాయపల్లి మండలం గొట్టిపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు ఆటోలో బయలుదేరగా.. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ దాడి చేసి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.