బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

అమెరికాలోని నయాగరా నుంచి న్యూయార్క్ వెళ్తున్న టూరిస్టు బస్సు బోల్తా పడి ఐదుగురికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.